Wed Feb 18 2026 17:37:16 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : పట్టు చీరలు బహుకరించిన లోకేశ్
Nara Lokesh : పట్టు చీరలు బహుకరించిన లోకేశ్

మంత్రి నారా లోకేశ్ కూటమి పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఉండవల్లి నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరైన కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాటలు, ముచ్చట్లతో చాలా సమయం సరదాగా గడిపారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు...
జవాబుదారీతనానికి నిదర్శనంగా, ప్రజాప్రతినిధులు ఎవరూ అడగకుండానే వారు ఇచ్చిన వినతులు పరిష్కారం అయినవి, పరిష్కార దశలో ఉన్నవి, పెండింగువి తెలియజేస్తూ నివేదికలు అందజేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విందు జరిగింది. ఇంట్లో శుభకార్యం నిర్వహించినప్పుడు పాటించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలు పెట్టారు
Next Story

