Sun Feb 22 2026 10:02:04 GMT+0530 (India Standard Time)
Amaravathi : సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం క్యాంపు కార్యాలయంలో జరిగింది. రాజధాని పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంలో జరిగిన భూ కేటాయింపులు, భూములు పొందిన సంస్థల నిర్మాణాలు-కార్యకలాపాలపై చర్చించారు.చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన సిఆర్డిఏ అథారిటీ సమావేశం లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వాటిని మంత్రి నారాయణ వెల్లడించారు. బాంక్ లకు ,బీజేపీ కార్యాలయానికి స్థలానికి సంబంధించి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
భూ కేటాయింపులకు తోడు...
కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. హై కోర్ట్,అసెంబ్లీ కి సంబంధించి ఎం వి పి వర్క్స్ కు సంబంధించి సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది. ఏజిఐసీఎల్ కు పనుల బదిలీ కి సంబంధించి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అమరావతి లో రోడ్లు డ్రైన్ల తో పాటు గ్రీన్ అండ్ బ్లూ డిజైన్ల కు సంబంధించి చర్చ జరిగింది. ఇతర దేశాల్లో ఉన్న పార్క్ లపై అధ్యయనం చెయ్యాలని ఎడిసికి సూచించాం.దీంతో పాటు ఆర్ 5 జోన్ లో అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను మరొక చోట ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story

