Mon Feb 02 2026 05:24:24 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : నేడు జనసేన పార్టీ కీలక సమావేశం
జనసేన పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది

జనసేన పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీకి చెందిన ముఖ్యనేతలందరూ హాజరవ్వాలని ఇప్పటికే పార్టీ నుంచి అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి.
రాష్ట్ర పరిణామాలపై...
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు, నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన నేతల్లో నెలకొన్న అసంతృప్తి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వంటి కీలక విషయాలపై పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా నేతలకు తన మనసులో అభిప్రాయాలను తెలియజేయనున్నారు. పార్టీ వైఖరిని కూడా ఆయన ఈ సమావేశం ద్వారా వెల్లడించే అవకాశముంది.
Next Story

