Fri Dec 05 2025 15:36:15 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : విజయవాడ నగరంలో భారీ వర్షం
విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారులు కాలువలను తలపిస్తున్నాయి.

విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. విజయవాడలో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించి పోయింది. అనేక ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పైకి వస్తే నీరు ఉండటంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు.
మోకాల్లోతు నీటితో...
విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర మోకాల్లోతు నీటితో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం పడుతుంది. మైలవరం, గన్నవరం, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో జనజీవనానికి ఇక్కట్లు తప్పడం లేదు. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

