Thu Feb 05 2026 13:36:35 GMT+0000 (Coordinated Universal Time)
రైతు సానుకూల ప్రదేశ్ గా మారుస్తున్నాం : చంద్రబాబు
ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైతు సానుకూలప్రదేశ్‌గా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైతు సానుకూలప్రదేశ్‌గా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నీటి భద్రత అందరికీ కావాలి..కానీ నీటి సంరక్షణను చాలా మంది పట్టించుకోవటం లేదన్నారు. • గతంలో రాయలసీమలోని ఊట కాలువల్లోనూ నీళ్లు సమృద్ధిగా ఉండేవని చంద్రబాబు అన్నారు. రాయలసీమ రాళ్ల సీమగా మారకుండా రతనాల సీమగా మార్చాలని ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపట్టారని, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు టీడీపీ చూపిన చొరవ కారణంగానే వచ్చాయని చంద్రబాబు చెప్పారు. తెలుగు గంగ రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ చెన్నై దాహార్తిని తీరుస్తోందన్న చంద్రబాబు ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య నీటి కోసం విభేదాలు వచ్చిన పరిస్థితి. కావేరీ జలవివాదం అలాంటిదేనని అన్నారు.
నీరు - మీరు చెట్టు కార్యక్రమంతో...
నీటి విలువ తెలిసిన వ్యక్తిగా నీరు మీరు, నీరు చెట్టు వంటి భూగర్భజలాలు పెంచేలా భూమినే జలాశయంగా మార్చడానికి ఇంకుడు గుంతల కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అనంతపురంలో చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాన్ని మన్ కీ బాత్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారని, పది లక్షల ఇంకుడు గుంతలు, మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటిని సద్వినియోగం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లాను ఎడారి కాదు పండ్ల తోటల వనంగా మార్చామన్న చంద్రబాబు హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలోని 40 జీవనదుల నీటిని సమర్ధంగా వినియోగించుకుంటే కరువనేదే ఉండదని అన్నారు. ప్రతి ఎకరాకూ నీటిని ఇచ్చేలా నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేయాలని, పరుగెత్తే నీటిని నిలపండి, నడిచే నీటిని జలాశయంగా మార్చండి, భూగర్భ జలాశయంలో నీటి నిల్వ పెరిగేలా చూడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Next Story

