Mon Dec 29 2025 06:02:24 GMT+0000 (Coordinated Universal Time)
Amarvathi : వచ్చే నెలలో ఆవకాయ్ అమరావతి
విజయవాడలో వచ్చే నెలలో ఫెస్టివల్ ను ప్రభుత్వం నిర్వహిస్తుంది

విజయవాడలో వచ్చే నెలలో ఫెస్టివల్ ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. పున్నమి ఘాట్ సమీపంలో జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ‘ఆవకాయ్ అమరావతి’ ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఉత్సవాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు, సందర్శకులు కార్యక్రమానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు...
కార్పొరేషన్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు.భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉత్సవ ప్రాంగణం సమీపంలో ఎగ్జిబిషన్‌కు ఇచ్చిన అనుమతి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో వేగంగా సాగుతున్న ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story

