Fri Jan 30 2026 07:49:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి.
భారీ బందోబస్తు...
మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. అన్నపూర్ణదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి రానున్నారు. ఇందుకోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

