Wed Mar 11 2026 13:11:52 GMT+0530 (India Standard Time)
Chandrabbau : జిల్లా కలెక్టర్టకు చంద్రబాబు సూచనలివే
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమయింది

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమయింది. కలెక్టర్ల సమావేశానికిమంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, జీఎస్డీపీ లక్ష్యాలు, జిల్లాల్లో విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష చేస్తున్నారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత, పెట్టుబడులు, వైద్యారోగ్యం, సూపర్ సిక్స్ పథకాలపై చర్చించనున్నారు. కలెక్టర్లకు వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ వర్గాలకు అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయమై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేలా చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల పట్ల...
ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు అధికారులు-ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ ప్లాన్ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయానికి ప్రొత్సహమిచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో వ్యవసాయం కోసం అత్యున్నత సంస్థ ఏర్పాటు చేద్దామన్న ముఖ్యమంత్రి, ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తున్నామని, ఉన్న పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నామని చెప్పారు. గతంలో కార్యాలయాల్లో కూర్చుని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి వర్చువల్ పనివిధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. • గడచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకువచ్చామని చెప్పారు.
Next Story

