Tue Feb 24 2026 11:04:32 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు అసెంబ్లీలో లడ్డూ అంశంపై చర్చ
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో లడ్డూ కల్తీపై నేడు చర్చించనుంది

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఈ వ్యవహారం పైన నేడు అసెంబ్లీలో చర్చ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశం పైన సీఎం చంద్రబాబు వద్ద కీలక సమావేశం జరిగింది. సభలో అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటుగా..టీటీడీ లో మార్పుల పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్యమతస్థుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించనున్నారు. కల్తీ నెయ్యి అంశం ఇప్పటి వరకు రాజకీయ దుమారానికి కారణమైంది. ఇప్పుడు ఈ అంశం పైన అసెంబ్లీ వేదికగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.నేడు అసెంబ్లీలో ఇందు కోసం నాలుగు గంటల సమయం కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కూడా మాట్లాడే...
ఇదే సమయంలో ముఖ్యమంత్రి వద్ద ఈ అంశం పైన ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఈరోజు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో ఆవర్ రద్దు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు నెయ్యి కల్తీ పై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి నెయ్యి కల్తీ పై టీడీపీ, జన సేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల లతో మాట్లాడించాలని నిర్ణయించారు. అయితే, స్వల్ప అస్వస్థత కారణంగా నిన్న సభకు పవన్ కళ్యాణ్ రాలేదు. నేడు సభకు వచ్చిన తరువాత కల్తీ నెయ్యి పై డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
Next Story

