Mon Mar 09 2026 12:02:56 GMT+0530 (India Standard Time)
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం రేపుతుంది

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం రేపుతుంది. 25 మంది వసతిగృహ విద్యార్థులు, సిబ్బందికి అస్వస్థత గురయ్యారు. గత 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స కొనసాగుతుంది. వైద్యులు వీరినిప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.
డయేరియాకు గల కారణాలపై...
అయితే డయేరియాకు గల కారణాలపై ఇప్పటికే విచారణ ప్రారంభమయింది. డయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్న అధికారులు, అన్ని కోణాల్లో విచారణచేస్తున్నారరు. నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు, వసతిగృహం, కుళాయిల నుంచి సుమారు 40 నమూనాలు సేకరించారు. రిపోర్టు వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చే అవకాశముంది.
Next Story

