Wed Dec 17 2025 09:43:48 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : గిరిజన గ్రామాలపై దృష్టి పెట్టండి : పవన్
గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు

గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏపీలో 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామన్న ఆయన 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్నార. రూ. 4,330 కోట్ల మేర నిధులను వేతనాలుగా ఉపాధి హామీ నుంచి చెల్లించామని, గ్రామ పంచాయితీల్లో రెవెన్యూ ఆర్జనపై దృష్టి సారించామని పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలన్న పవన్ కల్యాణ్ కేంద్ర పథకాల అమలులో వంద శాతం ఫలితాలు సాధించిన.. అల్లూరి, మన్యం జిల్లాల కలెక్టర్లను అభినందిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్‌కల్యాణ్ ప్రశంసించారు.
కూటమి ప్రభుత్వ లక్ష్యాలను...
నిబద్ధతతో కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామని, పంచాయతీరాజ్ సిబ్బంది శిక్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని పవన్ కల్యాణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పని చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామనీ, అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.
Next Story

