Sat Feb 21 2026 16:33:06 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు సీఆర్డీఏ కీలక సమావేశం
నేడు సీఆర్డీఏ సమావేశం జరగనుంది.

నేడు సీఆర్డీఏ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘం భూ కేటాయింపులపై కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీనిపై చంద్రబాబు చర్చించి భూముల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు భూ పంపిణీపైన కూడా చర్చిస్తారు.
రాజధాని పనుల పురోగతిపై...
మరొకవైపు రాజధానిలో జరుగుతున్న పనుల పురోగతిపై కూడా చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ సమావేశంలో చర్చించనున్నారు. భవన నిర్మాణ పనులు ఎంత వరకూ వచ్చాయన్న దానిపై ఆరా తీయనున్నారు. మూడేళ్లలో పనులు పూర్తి కావాలని చంద్రబాబు నిర్ణయించడంతో పాటు సీఆర్డీఏ ఆమోదించిన అంశాలకు ఈ నెల 24వ తేదీన కేబినెట్ మీటింగ్ లో చర్చించి ఆమోదించనున్నారు.
Next Story

