Fri Jan 23 2026 11:48:22 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపులో గందరగోళం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. భూములిచ్చిన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూముల్లో తమకు ప్లాట్లు కేటాయించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అలాంటి ప్లాట్లు తమకు అవసరం లేదని రైతులు సీఆర్డీఏ అధికారులకు తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఇవ్వడంలోనూ అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కోసం ఈ ప్లాట్లను కేటాయించనున్నారు.
తమకు చెప్పిన చోట...
అయితే ఈ లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించనున్నారు. గతంలో కూడా ఈ లాటరీ విధానం ద్వారానే ప్లాట్ల కేటాయింపు జరిగింది ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజధాని అమరావతిప్రాంతంలోని మొత్తం పథ్నాలుగు గ్రామాల్లోని తొంభయి మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతంది. మొత్తం 135 ప్లాట్లను కేటాయింనున్నారు. అయితే తమకు చెప్పిన చోట అధికారుల ప్లాట్లను కేటాయించడం లేదని చెబుతున్నారు. అయితే సీఆర్డీఏ అధికారులు వారికి నచ్చ చెబుతున్నారు.
Next Story

