Wed Mar 11 2026 10:55:01 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది

ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు అమరావతికి చేరుకున్నారు. ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రసంగించనున్నారు.
ప్రధానమైన అంశాలివీ...
రెండు రోజులు కలెక్టర్ల స్థానంలో జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు అభివృద్ధి పనులు, సంక్షేమంపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యలను తక్షణ పరిష్కారంతో పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులపై చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జిల్లా ఎస్పీలతో సమావేశం జరుగుతుంది.
Next Story

