Fri Mar 06 2026 12:37:41 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఈ నెల 11న కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం
ఈ నెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది

ఈ నెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అందరు జిల్లా కలెక్టర్లకు మెమోను గురువారం జారీ చేశారు.
ప్రధానమైన అంశాలివీ...
అమరావతిలోని సచివాలయంలో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్సు అవసరమైన సమాచారంతో జిల్లా కలెక్టర్లు హాజరు కావాలని కోరారు. ఈ రెండు రోజులు కలెక్టర్ల స్థానంలో జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎజెండా అంశాలను ప్రత్యేకంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు అభివృద్ధి పనులు, సంక్షేమంపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

