Mon Dec 29 2025 04:31:55 GMT+0000 (Coordinated Universal Time)
దావోస్ పర్యటనకు బయలుదేరే ఏపీ టీం ఇదే
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు కూడాక దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే అధికారులక పర్యటనకు సంబంధించి అనుమతిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
వచ్చేనెలలో జరగనున్న...
దావోస్‌లో వచ్చే నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ఏపీ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్, ఏపీ ఈడీబీ సీఈవో సాయికాంత్‌వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రిరెడ్డి, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ గీతాంజలి శర్మ హాజరుకానున్నారు. ఈ మేరకు వారి పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story

