Sat Dec 27 2025 04:53:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు హైదరాబాద్ కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఈరోజు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై సమీక్ష చేస్తారు. విజయవాడ కార్పొరేషన్ ను గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ గా మార్చాలని నిర్ణయించారు.
విజయవాడ కార్పొరేషన్ పై...
ఇందుకోసం అవసరమైన చర్యలు, ఏఏ ప్రాంతాలు విజయవాడలో కలపాలన్న దానిపై అధికారులతో చంద్రబాబు నాయుడు నేడు చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు హైదరాబాద్ కు బయలుదేరి రానున్నారు. అనంతరం సాయంత్రం గండిపేటలో జరిగే ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
Next Story

