Sat Mar 28 2026 16:15:15 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ విడుదలయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ విడుదలయింది. ఈరోజు తన క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమవుతారు. ఇద్దరి భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. రాజ్యసభ ఎన్నికలు, తిరుమల లడ్డూ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించునున్నారు.
ఈ శాఖలపై సమీక్ష...
అనంతరం ముఖ్యమంత్రి చంద్రాబు మధ్యాహ్నం 12.15 గంటలకు సచివాలయానికి చేరుకొని బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ అంశంపై సమీక్ష చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయం చేరుకుంటారు.
Next Story

