Fri Mar 06 2026 10:45:20 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడంతో పాటు ముక్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలను సమీక్ష చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.20 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు. 10.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు.
సాగునీటి ప్రాజెక్టులపై...
అనంతరం చంద్రబాబు నాయుడు సాయంత్రం 4.30 గంటలకు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో ఆంట్రా లక్స్ కన్వెన్షన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాత్రి 8.20 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు
Next Story

