Mon Feb 09 2026 22:06:47 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొననున్నారు. జీడీపీ వృద్ధిరేటు, ఆర్టీజీఎస్, పీపీపీ ప్రాజెక్టుల పురోగతితో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047, లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లోని మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు సమావేశం ఆరంభం కానుంది. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలపై చర్చిస్తారు. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షజరిపి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
అనేక అంశాలపై...
రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ది సూచించనున్నారు.
Next Story

