Mon Mar 16 2026 14:36:53 GMT+0530 (India Standard Time)
Amaravathi : అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
అమరావతి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.

అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా భారీ విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహావిష్కరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అమరజీవి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు, అమరావతిలో తొలి భారీ శిల్పంగా పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
58 అడుగుల విగ్రహాన్ని...
పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో అమరజీవి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశామని, అమరజీవి-త్యాగ శిల్పం (స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్) పేరుతో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆరు నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్ట్ మొదటి దశ పనులు పూర్తి చేశామని,రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణం జరుగుతుందని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Next Story

