Chandrababu : విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్రస్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు చేయలేమని తాము పారిపోవటం లేదని, రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నామని అన్నారు. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీస్థాయిలో ప్రజలు మద్దతు పలికారన్నారు. ప్రజలు సుపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారని, ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారని, మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదన్నారు

