Wed Mar 11 2026 09:39:08 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఇరాన్ యుద్ధ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష
ఇరాన్ యుద్ధ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు

ఇరాన్ యుద్ధ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటి ఎలాంటి ప్రభావం ఉందోననే అంశంపై నిరంతరం పరిశీలించాలని సీఎం సూచించారు.
ప్రవాసాంధ్రుల భద్రతపై...
యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖతో సంప్రదించి ప్రవాసాంధ్రుల క్షేమంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంతో పాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు.
Next Story

