Fri Mar 20 2026 20:42:06 GMT+0530 (India Standard Time)
ఏపీలో అకాల వర్షాలకు పంట నష్టంపై అంచనాలివే
అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు

అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. పన్నెండు జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందన్న అధికారులు వీటి విలువ రూ.40 కోట్లుగా అధికారులు తేల్చారు. తొమ్మిది జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్టు అధికారులు వెల్లడించారు.
ఉద్యాన పంటల నష్టం...
ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు. ఎల్పీజీ సరఫరా పైనా సీఎం సమీక్ష చేశారు. భవిష్యత్లో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని ఆదేశించారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని, గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు
- Tags
- chandrababu
Next Story

