Sat Apr 11 2026 19:16:52 GMT+0530 (India Standard Time)
Chandrababu : మావిగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
జగన్ మావిగన్ విమర్శలకు చంద్రబాబు సమాధానమిచ్చారు

జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి సరైన సమాధానమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు పూర్తి స్థాయి కౌంటర్ ఇస్తుందన్నారు. అభివృద్ధి అనేది ఆగదని, హైదరాబాద్, బెంగళూరు నిరంతరం పెరుగుతున్నాయని, హైదరాబాద్ వల్లే తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తుందన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో 5వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఎకరం రూ.10 కోట్లు విలువ వేసుకున్నప్పటికీ రూ. 50 వేల కోట్లు అవుతుందన్నారు. భవిష్యత్‌లో రూ.20 కోట్లు వేసుకుంటే.. ఆ భూమి విలువ లక్ష కోట్లు అవుతుందని, ఇలాంటి విషయాలు తెలియని వారు చేసే విమర్శలను పట్టించుకోబోమని చంద్రబాబు తెలిపారు.
నిరంతరంగా అభివృద్ధి దిశగానే...
అమరావతి అనేది నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందన్న చంద్రబాబు అభివృద్ధికి ముగింపు అనేది ఉండదన్నారు. హైదరాబాద్‌కు ORR, ఎయిర్‌పోర్టు, ఐటీ, నాలెడ్జ్ ఎకానమీ ఆదాయాన్ని పెంచాయని, సైబరాబాద్ వల్ల హైదరాబాద్ నేటికీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అమరావతి కూడా ఇదే తరహాలో అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి ఒక్క రోజుతో ఆగదని, అది నిరంతర ప్రక్రియ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Next Story

