Tue Jan 06 2026 20:00:28 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కృష్ణా జలాలపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు

కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణో అనేక నీటి పారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది టీడీపీనేనని అన్నారు. కృష్ణానదిపై తెలంగాణలో అనేక ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. గోదావరి నదిపైనా కూడా తెలంగాణలో అనేక ప్రాజెక్టులను తమ హయాంలోనే నిర్మించామని చంద్రబాబు తెలిపారు. నీటి విషయంలో తెలుగువారందరూ కలసి ఉండాలని కోరారు.
వృధాగా పోయే నీరు...
పోయిన ఏడాది 6,238 టీఎంసీలు కృష్ణా, గోదావరి నదిలో నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా మనం అభ్యంతరం చెప్పలేదన్నారు. వృధాగా సముద్రంలోకి వెళ్లే నీటిని ఉపయోగించుకోవాలన్నదే తన ఉద్దేశ్యమని చంద్రబాబు చెప్పారు. గంగా - కావేరి నదుల అనుసంధానం కావాలన్నదే తన కోరిక అని అన్నారు. అదే సమయంలో ఏపీలో ఉండే నదులన్నీ కలపాలని, తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలు కాదు, సమైక్యత ఉండాలని, కలసి ముందుకుపోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
Next Story

