Sat Mar 14 2026 10:23:16 GMT+0530 (India Standard Time)
మంత్రులు సిద్దంగా ఉండాలి... ముహూర్తం ఫిక్స్
కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక అజెండా పూర్తి చేసిన తరువాత మంత్రులతో తాజా పరిస్థితుల పైన చర్చించారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని.. అందరు సిద్ధంగా ఉండాలి అని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గెలిచామపి. ఇక.. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలి అని చెప్పిన ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఏప్రియల్ 1 నుంచి 90 రోజులు పాటు జలధార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రిపోర్టులు సిద్దం...
శాఖల్లో మంత్రులు, అధికారులు పై కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ను ఏప్రియల్ 2 వ తేదీన ఇస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా 2026-2027 సంవత్చరంలో పని తీరు మెరుగుపరచుకోవాలి సూచించారు. ఈ నివేదిక లో లక్ష్యాలు సాధించడం, ఫైల్స్ క్లియరెన్స్, కేంద్ర నిధులు వినియోగం, పథకాల అమలు వంటి అంశాలు రహస్య నివేదికలో ఉంటాయని వెల్లడించారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని.. అందరు సిద్ధంగా ఉండాలి అని చెప్పిన సీఎం..ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గెలిచాం అని చెప్పారు. ఇక.. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలి అని చెప్పిన ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Next Story

