Fri Mar 27 2026 19:39:48 GMT+0530 (India Standard Time)
Chadndrababu :ప్రధాని నిర్ణయంతో చంద్రబాబు హర్షం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి, ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సామాన్యుడిపై భారం పడకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు.
క్లిష్ట సమయాల్లో...
"నాయకత్వానికి నిజమైన పరీక్ష క్లిష్ట సమయాల్లోనే ఎదురవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న వేళ, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఎంతో చాకచక్యంగా ముందుండి నడిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో భారత్ సుస్థిరంగా ఉండటం మన అదృష్టం," అని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story

