Fri Jan 09 2026 09:01:04 GMT+0000 (Coordinated Universal Time)
Andhar Pradesh : మంత్రులపై మండిపడ్డ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రతి వారం పార్టీ కార్యాలయానికి వెళ్లి వినతులు స్వీకరిస్తున్నానని, అయినా వినతులు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. మంత్రులు పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి వినతులను స్వీకరించి పరిష్కరించాల్సి ఉందని గట్టిగా చెప్పారు.
జాబితా ఇవ్వాలన్నా...
మరొకవైపు పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడిన వారి పేర్లు ఎన్ని సార్లు అడిగినా మంత్రులు ఇవ్వకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తి చేశారు. పార్లమెంటరీ కమిటీలను కూడా తానే పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. మంత్రులు జిల్లా ఇన్ ఛార్జులుగా ఉంటూ ఏం పనిచేస్తున్నారని మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం ప్రశ్నించినట్లు తెలిసింది.
Next Story

