Mon Mar 02 2026 11:38:48 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు చంద్రబాబు కీలక సమీక్షలు
Chandrababu : నేడు చంద్రబాబు కీలక సమీక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కీలక సమీక్షలు చేయనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగిన కల్తీపాలు, కలుషిత నీరు, బాణసంచా పేలుళ్లపై సమీక్షలు చేయనున్నారు. రాజమహేంద్ర వరంలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించారు. శ్రీకాకుళం జిల్లాలో డయారియా వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఆసుపత్రుల్లో చేరారు.
మూడు ఘటనలపై...
మరొకవైపు తూర్పు గోదావరి జిల్లా వేట్లపాలెం గ్రామంలో బాణా సంచా పేలి ఇరవై మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకల్తీ పాలు, కలుషిత నీరు, బాణసంచా పేలుళ్లపై నేడు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. లేకుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించనున్నారు.
Next Story

