Sat Mar 28 2026 19:17:06 GMT+0530 (India Standard Time)
Amaravathi : అమరావతి అందరిదీ.. అందుకే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేశాం
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపే తీర్మానంపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు

అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపే తీర్మానంపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కృష్ణా- గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించారన్నారు. బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ కూడా ఉందని, ఆనాటి చరిత్రను అక్కడ భద్రపరిచారన్నారు. అంతటి ప్రాచీన, ఘన చరిత్ర తెలుగు జాతిది. సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగునేల ఇది అని చంద్రబాబు తెలిపారు. బ్రిటిష్ వారు వచ్చాక పరిస్థితులు మారాయని, 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రాభవం కోల్పోయామని, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులు అనే పేరు మనకు వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
తెలుగు రాష్ట్రం అనేక ప్రాంతాలకు...
పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించిందన్న చంద్రబాబు మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్ కు రాజధాని మారింది. ఇప్పుడు అమరావతికి మార్చుకున్నామని, రాజధానులు కోల్పోవటం విమర్శలు, వివక్షత, అవమానాలు భరిస్తూనే వచ్చామని తెలిపారు. 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళంలో ఉందని తెలిపారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు అందిపుచ్చుకున్నామని, 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నామని చెప్పారు. ఐటీ రివల్యూషన్ ను ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గా అందిపుచ్చుకున్నామని చంద్రబాబు తెలిపారు. అప్పుడు చేసిన విజన్ కారణంగా రూ.1.05 లక్షల కోట్లు రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తోందని,
సైబరాబాద్ ను ఇటుక పేర్చి...
సైబరాబాద్‌ను ఇటుకా ఇటుకా పేర్చి నిర్మాణం చేశామని, ఫలితాలు వచ్చాయని, అందుకే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని చంద్రబాబు చెప్పారు. విభజన సమయంలో సమన్యాయం చేయాలని కోరానని, ఇప్పటి వైసీపీ నాయకుడు నాడు పార్లమెంటులో ఉండి కెమెరాలు నుంచి తప్పించుకు తిరిగాడన్నారు. 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కానీ, త్వరితగతిన సొంత రాజధాని నిర్మాణం చేయాలని ఇక్కడికి వచ్చామని చెప్పారు. తొమ్మిది నెలల్లో ఈ అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నామని, సింగపూర్ సహకారంతో ఆ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు ఇవ్వాలని కోరామని చంద్రబాబు తెలిపారు. ముందు దేశం బాగుండాలి, అలా ఉండాలంటే మన జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు.
పవిత్రమైన మట్టితో ..నీళ్లతో...
తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే తన సంకల్పం కూడా అని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పిందని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పారని, కానీ రోజుకో మాట ఊసరవెల్లి రాజకీయాలు చేశాడని అన్నారు.టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేశాడన్న చంద్రబాబు వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చని చెప్పారు. రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించానని, ఈ ప్రాంతాంలోని రైతులను సంప్రదించి 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చేశారని, రాజధానికి రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు వక్తులు తోటలకు నిప్పు పెట్టారని, ప్రపంచ బ్యాంకుకు ఈమెయిళ్లు పెట్టారని, కానీ పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని తెలిపారు. అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు.
Next Story

