Tue Apr 07 2026 12:38:57 GMT+0530 (India Standard Time)
నేడు రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సమావేశం
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది

నేడు సచివాలయంలో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. మంత్రి కందుల దుర్గేష్, వర్చువల్ గా హాజరుకానున్న మంత్రులు పయ్యావుల కేశవ్,డోలా బాల వీరాంజనేయస్వామి లు హాజరుకానున్నారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రభుత్వ ఆదాయ వనరుగా విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను మార్చాలని కమిటీ సిఫార్సు చేసే అవకాశముందని తెలిసింది.
నెలకు ఇరవై ఐదు లక్షలు...
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఖజానాపై మోయలేని భారం..రుషికొండ భవనాల నిర్వహణ, విద్యుత్ కోసం నెలకు 25 లక్షల రూపాయల ప్రజా ధనం వృధా అవుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్యాలెస్ వినియోగంపై నేటి భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు నివేదిక సమర్పించనున్నారు. ఈ నెల 10వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో లో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

