Mon Feb 16 2026 11:54:04 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు అమరావతికి బిల్ గేట్స్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఈరోజు అమరావతికి రానున్నారు

గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఈరోజు అమరావతికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బిల్ గేట్స్ తో పాటు ఆరుగురు ఫౌండేషన్ కు చెందిన ప్రతినిధులు రానున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేశ్, మంత్రి నారా లోకేశ్ లతో సమావేశమవుతారు. సెక్రటేరియట్ లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ బృందం పరిశీలిస్తుంది.
వివిధ కార్యక్రమాలతో...
అనంతరం బిల్ గేట్స్ బృందంతో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమవుతారు. ఏపీలో విద్య, వైద్య, వ్యసాయ రంగంలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చిస్తారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవిని ప్రాజెక్టు గురించి తెలిేస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలసి బిల్ గేట్స్ బృందం సందర్శిస్తుంది. రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలను బిల్ గేట్స్ ఫౌండేషన్ అందించేలా ఈ కార్యక్రమంలో చంద్రబాబు కోరనున్నారు.
Next Story

