గుడ్ వర్క్ అంటూ గేట్స్ కితాబు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు

ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్న బిల్ గేట్స్ ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం చంద్రబాబు వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్న గేట్స్ అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు సీఎం చంద్రబాబు తెలిపారు.

