Sat Mar 28 2026 09:55:12 GMT+0530 (India Standard Time)
Andhra Prdesh :నేడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది

నేడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీలో దాదాపు గంటలపాటు చర్చ జరగనుంది.
కేంద్రానికి తీర్మానాన్ని పంపి...
అనంతరం తీర్మానాన్ని కూటమి సర్కార్ కేంద్రానికి పంపనుంది. తీర్మానం సమన్వయ బాధ్యతలు మంత్రులు లోకేష్, పయ్యావుల, నాదెండ్లకు అప్పగించారు. ఈ తీర్మానంతో కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశంలో రాజధాని అమరావతికి చట్టబద్ధత తెస్తూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనుంది.
Next Story

