Wed Feb 11 2026 12:58:40 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలకు ఫేసిషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరును తీసుకోనున్నారు. సభకు వచ్చి తన స్థానంలో వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే హాజరు మాత్రమే నమోదవుతుంది. ఏఐ ఆధారంగా ఈ ఫేసిషియల్ రికగ్నేషన్ ద్వారా హాజరును తీసుకోవాలని నిర్ణయించారు.
ఫేసిషియల్ రికగ్నిషన్ ద్వారా...
వైసీపీ ఎమ్మెల్యేలు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి సభలోకి రాకుండా బయట నుంచి వెళ్లిపోతున్నారని, దీనిని అరికట్టేందుకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే స్పీకర్ కార్యాలయం గుర్తించింది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలకు కొత్తగా ఫేసిషియల్ రికగ్నేషన్ ఆధారిత అటెండెన్స్ తీసుకోనున్నారు.
Next Story

