Wed Feb 11 2026 15:51:06 GMT+0530 (India Standard Time)
నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు వరసగా బెదిరింపులు లేఖలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు వరసగా బెదిరింపులు లేఖలు వస్తున్నాయి. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ లకు ఈ బెదిరింపు లేఖలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రిజిస్టర్ పోస్టులో లేఖలు రావడంతో మావోయిస్టులు రాసిన లేఖగా తొలుత భావించినప్పటికీ తర్వాత వారి పని కాదని అర్థమయింది.
ప్రాణహాని ఉందంటూ...
మంంత్రులకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నారు. నలుగురు మంత్రులకు ఒకరే లేఖ రాసినట్లు స్పష్టమవుతుంది. అయితే ఈ లేఖలు ఆకతాయిలు రాశారా? లేక ఎవరైనా నిజంగా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఇటువంటి లేఖలు కావాలని రాశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Next Story

