Fri Dec 05 2025 21:16:21 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాకు షాకిచ్చిన ఏపీలోని హోటల్ యజమానులు
ఆంధ్రప్రదేశ్ హోటల్ యజమానుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ హోటల్ యజమానుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు తరహాలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో పెప్సి, కోకాకోలా వంటి అమెరికన్ శీతల పానీయాలు మరియు ఇతర అమెరికా ఉత్పత్తులను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది.అమెరికా ప్రభుత్వం భారతీయ వస్తువులపై 50% సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా కంపెనీలకు...
అమెరికన్ కంపెనీలకు బదులుగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, రైతులు, స్థానిక పరిశ్రమలకు మద్దతుగా ఇలాంటి చర్యలు అవసరమని అని ఆంధ్రప్రదేశ్ హోటల్ యజమానుల సంఘం స్పష్టం చేసింది.మిగిలిన రాష్ట్రాల హోటల్ యజమానుల సంఘాలు కూడా ఇలాగే ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
Next Story

