Mon Mar 23 2026 09:47:46 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో రేషన్ షాపుల్లో కిరోసిన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. నేటి నుంచి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయడానికి సిద్ధమవుతుంది. ఇజ్రాయి- ఇరాన్ యుద్ధంతో ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది కరంగా మారింది.
ముందుగా గిరిజన ప్రాంతాల్లో...
గ్యాస్ లేకపోవడంతో ఎక్కువ మంది కట్టెలు, బొగ్గుల మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా పేదలకు కిరోసిన్ ను గతంలో రేషన్ దుకాణాల నుంచి సబ్సిడీ ధరకు పంపిణీ చేసేవారు. తిరిగి అదే పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు 2,800 కిలో లీటర్ల కిరోసిన్ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
Next Story

