Sat Mar 28 2026 15:06:59 GMT+0530 (India Standard Time)
భారతి, రామ్‌కో సిమెంట్స్‌కు నోటీసులు
భారతి, రామ్‌కో సిమెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది

భారతి, రామ్‌కో సిమెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్న సున్నపురాయి లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. ఏప్రిల్ 6న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు కంపెనీ ప్రతినిధులకు అవకాశం కల్పించింది.
నిబంధనలకు విరుద్ధంగా...
భారతి, రామ్ కో సిమెంట్స్ సున్నపు రాయి లీజులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి తాజాగా ఈ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్న వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. గనులశాఖ సంచాలకుడు చంద్రశేఖర్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఆధారంగా లీజు రద్దుపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది.
Next Story

