Fri Dec 05 2025 22:46:38 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ప్లాస్టిక్ నిషేధిస్తూ...
ఈ సందర్భంగా ఏ రోజు చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా రాష్ట్రంలో 50 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని దశల వారీగా ప్రయివేటు సంస్థల్లోనూ అమలు పర్చాలని కోరుతున్నారు.
Next Story

