Fri Jan 02 2026 08:37:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో జీఎస్టీ వసూళ్లలో ముందు
జీఎస్టీ వసూళ్లలో ఏపీ ముందంజలో ఉంది

జీఎస్టీ వసూళ్లలో ఏపీ ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జిఎస్టి సంస్కరణలు, పన్ను రేట్ల తగ్గింపు లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ తన ఆదాయ వనరులను పెంచుకోవడంలో మంచి స్థానాన్ని దక్కించుకుంది. డిసెంబర్ 2025 నెలలో రాష్ట్రం సాధించిన నికర జిఎస్టి వసూళ్లు కేవలం గణాంకాలు మాత్రమే కాదు, అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైందని, సవాళ్లను అధిగమిస్తూ.. రికార్డు వసూళ్ల వైపు పరుగులు తీస్తుందని అధికారులు తెలిపారు.
మునుపెన్నడూ లేని విధంగా...
డిసెంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 2,652 కోట్ల నికర జిఎస్టిని వసూలు చేసిందని, 2017లో జిఎస్టి విధానం అమల్లోకి వచ్చినప్పటి నుండి డిసెంబర్ నెలలో నమోదైన అత్యధిక వసూళ్లు ఇవే కావడం విశేషం. గత ఏడాది తో పోలిస్తే ఇది 5.78% వృద్ధిని నమోదు చేసింది, ఇది జాతీయ సగటు 5.61%కంటే మెరుగ్గా ఉండటం గమనార్హమని అధికారులు తెలిపారు.
Next Story

