Mon Feb 23 2026 12:07:05 GMT+0530 (India Standard Time)
నేడు కూడా మండలిలో ఇందాపూర్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి.

నేటి ఉదయం 10 గంటలకి ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే వైసీపీ నేతలు ఇందాపూర్ డెయిరీ పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. గత ఐదు రోజుల నుంచి ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతుంది.
వాయిదా తీర్మానాన్ని...
అయితే ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ తిరస్కరిస్తుండటంతో సభను వైసీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇదే వ్యవహారం శాసనమండలిలో జరుగుతుంది. దీంతో సభ చాలా సేపు అదుపులోకి రాకపోయేసరికి మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

