Sat Dec 13 2025 22:34:16 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : క్వాంటం వ్యాలీ.. ఇక అమరావతికి కొత్త రూపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం పై దృష్టి సారించింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం పై దృష్టి సారించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన భవన నమూనాలను అధికారులు పరిశీలించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాజెక్ట్ పొందుపరుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టు అయిన క్వాంటం వాలీని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మిస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రాథమిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో క్వాంటం వాలీ నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి.
యాభై ఎకరాల్లో...
లింగాయపాలెం సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని యాభై ఎకరాల్లో క్వాంటం వాలీ నిర్మాణం జరగనుంది. మౌలిక వసతుల పనులు వేగంగా కొనసాగించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 80 లక్షల చదరపు అడుగులుగా నిర్ణయించారు. క్వాంటం వాలీ ప్రధాన భవనం చుట్టూఎనిమిది అత్యాధునిక టవర్లను నిర్మించనున్నారు. పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలకు ప్రత్యేక స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. అమరావతి పేరుకి సంకేతంగా ప్రధాన భవనం "A" ఆకారంలో డిజైన్ ను రూపొందించారు.
వేలాది మందికి ఉద్యోగాలు...
సెంట్రల్ నిర్మాణం విస్తీర్ణం 45 వేల చదరపు అడుగులుగా నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, భవిష్యత్తు టెక్ కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ క్వాంటం వ్యాలీలో దేశంలో అనేకమంది ఐటీ దిగ్గజాలు ఈ క్వాంటం వాలీ లో పాలుపంచుకోనున్నాయి. క్వాంటం వ్యాలీ పూర్తిగా పనిచేయడం ప్రారంభమయితే వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్న అంచనాలు వినపడుతున్నాయి. క్వాంటం వ్యాలీ పూర్తిగా పనిచేయడం మొదలైతే వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అమరావతిలో బలమైన IT ఈకోసిస్టమ్ ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Next Story

