Sat Dec 13 2025 19:30:49 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.45 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 జిల్లాల పున:ర్విభజనపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాగునీరు, పారిశుధ్యం, ఇతర వసతులుపై చంద్రబాబు సమీక్షిస్తారు.
గోదావరి పుష్కరాలపై...
అలాగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు లక్షల మంది భక్తులు వస్తారని భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించనున్నారు. మంచినీరు, రోడ్లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Next Story

