Fri Dec 05 2025 11:36:33 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మెడికల్ కళాశాలల వ్యవహారంపై చంద్రబాబు ఆలోచన ఇలా ?
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజారోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రతి జిల్లాకు మెెడికల్ కళాశాల ఉండాలని తాను ఏనాడో చెప్పానని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 వైద్య కళాశాలలున్నాయన్న ఆయన, వైసీపీ హయాంలో పదిహేడు వైద్య కళాశాలల ఏర్పాటుకు కేవలం 1,550 కోట్లను మాత్రమే కేటాయించారన్నారు.
మరో పదిహేనేళ్లు పడుతుందంటూ...
వైసీపీ ఆలోచన ప్రకారం పాలిస్తే రాష్ట్రాభివృద్ధికి మరో పదిహేనేళ్ల సమయం పడుతుందని అన్నార. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని గుర్తు చేసిన చంద్రబాబు వైద్య కళాశాలల విషయంలో పీపీపీ విధానంలో ముందుకెళుతున్నామని తెలిపారు. అసలు పీపీపీ అంటే ఏంటో వైసీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా అనేక రంగాల్లో పీపీపీ విధానాన్ని అమలుచేస్తున్నారని, సంపద సృష్టి వేగంగాజరగాలంటే ఈ విధానమే మంచిదన్నారు. అప్పుడే పెట్టుబడి దారులు ముందుకు వస్తారని తెలిపారు.
Next Story

