Sat Dec 13 2025 19:30:00 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రాజధాని రైతులతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు నేడు పాల్గొననున్నారు. ఉదయం 10.20 గంటలకు వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. 10.30 గంటలకు ఆలయ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
నేటి షెడ్యూల్ ఇదే...
మధ్యాహ్నం 12.10 గంటలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు దేవాదాయ, టీటీడీపై సమీక్ష చేస్తారు. సాయంత్రంనాలుగు గంటలకు రాజధానికి భూములిచ్చిన రైతులతో సమావేశమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Next Story

