Tue Apr 07 2026 09:39:30 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నేడు జరగనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నేడు జరగనుంది. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీజరగనుంది. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఉపాధి కల్పనలతో పాటు...
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగాల నియామకాలపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమై కీలక నిర్ణయాలను తీసుకోనుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో నేడు ఉద్యోగాల కల్పన, భవిష్యత్ ప్రణాళికపై మంత్రి వర్గ ఉప సంఘం చర్చించనుంది.
Next Story

