Thu Mar 26 2026 10:43:59 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై నేడు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అమరావతిని...
ఈనెల 28న అసెంబ్లీ సమావేశం నిర్వహణపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 28న అమరావతి రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నేటి కేబినెట్ లో చర్చించిన తర్వాత అసెంబ్లీ సమావేశ తేదీలను ఖరారు చేస్తారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించనున్నారు.
Next Story

