Fri Mar 20 2026 18:50:41 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh :నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారరు. ఉదయం పదిన్నర గంటలకు సచివాలయంలో సమావేశం జరగనుంది. ప్రధానంగా భూ కేటాయింపులతో పాటు వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలపై మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది.
బడ్జెట్ సమావేశాలపై...
దీంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి శాసనసభ సమావేవాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలపై కూడా మంత్రి వర్గం చర్చించనుంది. దీంతో పాటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు చెప్పనుంది.
Next Story

